ప్రపంచం మొత్తం మూడేళ్లుగా ఎంతో ఈగర్‌గా ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) జోడీగా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పుష్ప-2: ది రూలింగ్ (Pushpa 2: The Ruling). బుధవారం రాత్రి 9.30కి స్పెషల్ షో(Special Shows)లు రిలీజయ్యాయి. మరి పుష్ప రాజ్ దండయాత్ర రెండో పార్టులోనూ కొనసాగిందా.. ఫస్ట్ ఆఫ్ చూసిన అభిమానులు ఏమంటున్నారు.. తెలుసుకుందాం..
మరో నేషనల్ అవార్డ్ పక్కా
పుష్ప-2(Pushpa-2) మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు ఎదురు చూస్తున్న వేళ ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ రివ్యూ(First off review) వచ్చేసింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒకటైన ఈ సీక్వెల్‌తో అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు(National Award)ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మూవీ ఓపెనింగ్ సీన్స్, విజువల్స్, సాంగ్స్, ఇంటర్వెల్(Intervel) మరో లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. కాగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బుధవారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోలు పడ్డాయి.
ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ చూసిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్‌బస్టర్(Blockbuster)పైసా వసూల్ ఎంటర్టైనర్ అని కొనియాడుతున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్టులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్(Goose bumps) తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు. దేవిశ్రీ(DSP)మ్యూజిక్, సుక్కు మార్క్ డైరెక్షన్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు.
బన్నీ ఎంట్రీ అదుర్స్
జపాన్ లో యోకొహమా పోర్ట్‌లో సినిమా మొదలవుతుంది. అక్కడే పుష్ప రాజ్ మాస్ ఎంట్రీకి ఎలివేషన్ జరుగుతుంది. ఆ పోర్ట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప రాజ్ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఎంట్రీ ఉంటుంది.. అంతేకాదు ఆయనతో పాటు భన్వర్ సింగ్ షెఖావత్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పుష్ప రాజ్‌తో ముఖ్యమంత్రి, రావు రమేష్‌ల మధ్య సీన్స్ సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక్కడ అల్లు అర్జున్ నిర్ణయం అందరినీ షాక్ చేస్తుందట. ఇక్కడి నుంచి కథ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుందని అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.
అందరూ మెచ్చే పైసా వసూల్ మూవీ
మరోవైపు పుష్ఫ-2తో అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డ్ ఫిక్స్ అంటూ ట్వీట్స్(Tweets) చేస్తున్నారు. తన మాస్ అవతారంతో అందరినీ మెప్పించాడు. అతని నటన అద్భుతం. కామెడీ టైమింగ్ బాగుందని అభిమానులు వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్నారు. క్లాసెస్, మాసెస్ అందరూ మెచ్చే పైసా వసూల్ మూవీ అని కొందరు, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాయడం పక్కా అని మరి కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ(
Biggest hit movie)గా నిలవనుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil)నటన మూవీలో మరో రేంజ్‌లో ఉందంటూ పొగిడేస్తున్నారు. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల(Srileela), బన్నీ(Bunny) తమ డ్యాన్స్‌తో ఇరగదీశారని చెబుతున్నారు.






