Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘పుష్ప2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్‌లలో వివిధ ఫార్మాట్‌లలో విడుదల చేయనున్నారు. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా స్క్రీనింగ్ విషయంలో ఓ ట్విస్టు చోటుచేసుకుంది. అదేంటంటే..?
విడుదలకు ముందే ట్విస్టు
పుష్ప-2 సినిమా 3D వెర్షన్‌ను ప్రస్తుతానికి విడుదల చేయటం లేదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మూవీని 3డీ వెర్షన్‌కు (pushpa 2 3d show) అనుగుణంగా షూట్ చేసినా అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు. అందువల్ల ప్రస్తుతానికి అన్ని థియేటర్లలో 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు.
మరి వాళ్ల సంగతేంటి?
ఇక ఇప్పటికే 3డీ వెర్షన్‌లో చూద్దామని టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. అయితే ఇప్పటికే బుక్ చేసుకుంటే ఆ షో క్యాన్సిల్ (Pushpa 2 3D Show Cancel) అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. లేదా అదే స్క్రీన్‌లో 2డీ వెర్షన్‌లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
7 ఫార్మాట్లు.. ఆరు భాషలు
ఇక పుష్ప-2 సినిమా సంగతికి వస్తే.. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొత్తం ఏడు ఫార్మాట్‌లలో (ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ) విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్ రెడీ అయింది.
#BreakingNews… ‘PUSHPA 2’ *3D VERSION* NOT RELEASING THIS WEEK… The *3D version* of #Pushpa2 will not release this Thursday [5 Dec 2024]… The *2D version* will arrive as scheduled on 5 Dec 2024.
Additionally, there will be *no midnight shows* for the #Hindi version of… pic.twitter.com/AJn5T2LRtT
— taran adarsh (@taran_adarsh) December 3, 2024
బుక్ మై షోలో రికార్డు
ఇక రిలీజ్ కు ముందే పుష్ప -2 సినిమా ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ (pushpa 2 ticket booking)లో అత్యంత వేగంగా మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) నిలిచింది. ముఖ్యంగా ఉత్తరాదిలోనూ ‘పుష్ప’ మేనియా గట్టిగా కనిపిస్తోంది.






