ManaEnadu : అల్లు అర్జున్ (Allu Arjun)ను ఐకాన్ స్టార్ చేసి.. పాన్ ఇండియా హీరో రేంజులో నిలబెట్టిన సినిమా పుష్ప. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప-2 రాబోతోంది. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ నుంచి ఒక్కో అప్డేట్ వదులుతున్నారు. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా చాలా రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘పుష్ప పార్ట్ 1’ రికార్డును పార్ట్ 2 తాజాగా బ్రేక్ చేసింది.
ఓవర్సీస్ బుకింగ్స్‌లో పుష్పరాజ్ హవా
పుష్ప-2 (Pushpa 2) సినిమా ఓవర్సీస్ బుకింగ్స్‌లో హవా చూపిస్తోంది నార్త్ అమెరికాలో భారీ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మంగళవారం (నవంబర్ 5వ తేదీ) నాటికి ‘పుష్ప 2’ మూవీ.. ప్రీ బుకింగ్స్ ద్వారా 4లక్షల డాలర్లు వసూల్ చేసింది. మొత్తం 2750 షోలకు గాను, దాదాపు 15వేల టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ఇంకా 30 రోజుల సమయం ఉండడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉంది.
పుష్ప-1 రికార్డ్ బ్రేక్
మరోవైపు నార్త్ అమెరికాలోనే ‘పుష్ప పార్ట్ 1’ లాంగ్ రన్లో మొత్తం 4లక్షల డాలర్లు కలెక్ట్ చేయగా.. తాజాగా ‘పుష్ప ది రూల్ (Pushpa The Rule)’ ఆ వసూళ్లను దాటేసింది. రిలీజ్‌కు నెల రోజుల ముందుగానే పార్ట్ 1 ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డ్‌ను పుష్ప-2 బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ (Sukumar).. పుష్ప-2లో సూపర్ సీన్ సీక్వెన్స్ ఉంటాయని చెప్పారు. ఇక పుష్ప రాజ్ – బన్వర్ సింగ్ మధ్య సీన్లు వేరే లెవెల్లో ఉంటాయని చిత్రంపై ప్రేక్షకులకు భారీగా అంచనాలు క్రియేట్ చేశారు.






