ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. సుమారు రూ.1800 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక హిందీలోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
పుష్ప2 థాంక్స్ మీట్
ఈ సినిమా విడుదలయ్యాక చోటుచేసుకున్న పరిణామాల రీత్యా మేకర్స్ భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ సద్దుమణగడంతో తాజాగా ‘పుష్ప 2’ టీమ్.. థాంక్స్ మీట్ (Pushpa 2 Thanks Meet నిర్వహించాలని నిర్ణయించింది. శనివారం (ఫిబ్రవరి 8వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ వస్తాడా రాడా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బన్నీ వస్తాడా?
అయితే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీమ్‌తోపాటు కీలక సభ్యులు ఇందులో పాల్గొంటారని సమాచారం. ఇందులో భాగంగా చిత్ర బృందానికి సక్సెస్ షీల్డ్స్ అందజేయనున్నట్లు తెలిసింది. అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ ఏ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనలేదు. ఈ క్రమంలో నేడు జరగనున్న థాంక్స్ మీట్‌కు అల్లు అర్జున్ హాజరుకానున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఈవెంట్ కు భారీ హైప్ క్రియేట్ అయింది.






