Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప2: ది రూల్ (Pushpa 2 : The Rule)’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా సోమవారం రోజున హైదరాబాద్ లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
పుష్ప-3పై సుకుమార్ హింట్
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప పార్ట్-1, పార్ట్-2 కోసం అల్లు అర్జున్ ను మూడేళ్లు కష్టపెట్టానని అన్నారు. తను మళ్లీ మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉంటే ‘పుష్ప3’ చేస్తానని (Pushpa3 Update) తెలిపారు. దీంతో పుష్ప-2కు కొనసాగింపుగా ‘పుష్ప3’ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
పుష్ప-3 టైటిల్ ఇదే
పుష్ప సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోను స్కాన్ చేసిన నెటిజన్లు ఓ క్రేజీ విషయం కనిపెట్టారు. ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్ (Pushpa 3 Title) ఉన్న పోస్టర్ కనిపించింది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్ (Pushpa 3 : The Rampage)’ అని ఉండటంతో పార్ట్-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని నెటిజన్లు అంటున్నారు.
మరో రెండ్రోజుల్లో పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు
ఇక పుష్ప-2 సినిమా డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ (Pushpa 2 Release Date) కాబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల (Sree Leela) స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఇంకా ఈ చిత్రంలో అనసూయ, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీఎస్పీ మ్యూజిక్ అందించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.






