పుష్ప.. పుష్ప రాజ్.. నీయమ్మ తగ్గేదేలే.. అనే డైలాగ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా పుష్ప-2 ప్రమోషన్స్(Pushpa-2 Promotions) నిర్వహిస్తున్నారు ఆ మూవీ మేకర్స్. ఇప్పటికే పట్నా, చెన్నై(Chennai)లో భారీ ఈవెంట్లు నిర్వహించిన పుష్ప టీమ్ మరో బిగ్ వేడుకకు ప్లాన్ చేసింది. మరో 10 రోజుల్లోనే మూవీ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ విషయంలో అస్సలు తగ్గేదే లే అంటున్నాడు అల్లు అర్జున్ అండ్ కో(Allu Arjun &Co). ఉన్న తక్కువ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ టూర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప 2 టీమ్. దీనికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) ఈ ఈవెంట్లకు హాజరైనా.. కాకపోయినా బన్నీ మాత్రం పక్కాగా ప్రతి ఈవెంట్‌కు వెళ్లాలని నిర్ణయించాడట.
చివరగా హైదరాబాద్‌లో..
ఈ క్రమంలోనే మొదటి అడుగు బిహార్ నుంచి పడింది. పట్నా ఈవెంట్ బ్లాక్‌బస్టర్ కావడంతో.. అదే ఊపులో మరో మూడు నాలుగు ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేశారు. సిని వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 27న కేరళలో, 28న గోవా, 29 ముంబై, 30వ తేదీన బెంగళూరులో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్(Special promotional events) నిర్వహించాలని పుష్ప టీమ్ భావిస్తోంది. అందుకు తగ్గట్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తోంది. అన్నీ పూర్తయ్యాక.. చివరగా డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్(Hyderabad)లో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ బుకింగ్స్(Pre-bookings) డిసెంబర్ 1,2వ తేదీ నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
12,000 స్క్రీన్‌లలో రిలీజ్?
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner)పై సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ భారీ బాక్సాఫీస్ హిట్ అవుతుందనడంపై ఏమాత్రం సందేహం లేదు. అందుకు తగ్గట్లే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 స్క్రీన్‌లలో పుష్ప-2 విడుదల కానుంది. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్(USA)లో అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ వంటి స్టార్లతో పాటు ఓ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల(Srileela) సందడి చేసిన విషయం తెలిసిందే.






