ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2(Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప2కి దాదాపు అన్ని భాషల్లోనూ హౌస్ ఫుల్ షోస్ పడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం మూవీ టీం కూడా ప్రమోషన్స్(Promotions)కు డిఫరెంట్ స్టైల్లో చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
24 గంటల్లోనే 44.67M వ్యూస్
ఇదిలా ఉండగా ఆదివారం బిహార్ క్యాపిటల్ పాట్నా(Patna)లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్(Trailer) విడుదలైన 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్‌కు 44.67 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అలాటే సౌత్ ఇండియా(South India)లో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగానూ, 8.8లక్షల లైక్స్‌తో దూసుకోపోతోంది. అటు హిందీ వెర్షన్(Hindi Version) ట్రైలర్‌కు 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరోవైపు ప్రమోషన్స్ క్రియేవిటీలోనూ కొత్త స్ట్రాటజీని వాడుతోంది పుష్ప టీమ్.
తెలుగు సినిమాగా రికార్డు సృష్టిస్తుందా?
ఇదిలా ఉండగా పుష్ప-2 మరో ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోందట. అయితే ఈసారి ఇండియాలు మాత్రం కాదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో(International Level) ఉంటుందట. ఇందుకోసం దుబాయ్‌లో స్పెషల్ ఈవెంట్(Special Event In Dubai) ఉంటుందని పేర్కొంది. అలాగే ముంబై(Mumbai)లోనూ మరో ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇక ఇదే విషయమై పుష్ప నార్త్ బెల్ట్ ఓపెన్నాం అని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే పాట్నా తరహా ఈవెంట్ మాత్రం ఇకపై ఉండవని పుష్ప-2 యూనిట్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే కనుకు నిజం అయితే ఓ తెలుగు సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించిన సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టించనుంది.






