భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(Star shuttler PV Sindhu) సత్తాచాటింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ( Syed Modi International title) టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా ప్లేయర్‌పై జయభేరి మోగించింది. లక్నో వేదికగా జరిగిన ఫైనల్లో చైనా షట్లర్ వు లుయో యు(China’s Wu Luo Yu)పై సింధు వరుస సెట్లలో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడిన సింధు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 21-14, 21-16తో మ్యాచ్‌లో గెలిచి తన మూడవ సయ్యద్ మోడీ అంతర్జాతీయ టైటిల్(Title)ను కైవసం చేసుకుంది. గాయం కారణంగా 2023 ఎడిషన్‌కు దూరమైన ఈ భారత ఏస్.. 2017, 2022లో టైటిల్‌ను గెలుచుకుంది.
గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం
కాగా గేమ్(First Game) ప్రారంభంలో సింధు 5-3 ఆధిక్యంతో మ్యాచ్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. అయితే చైనా షట్లర్(China shuttler) ఆట అంతటా భారత స్టార్‌పైనే ఉంటుంది. మిడ్ గేమ్ విరామ సమయానికి, సింధు తన ముందు ఉన్న సవాలును అర్థం చేసుకోవడంతో స్కోర్‌లైన్ 11-9కి అనుకూలంగా ఉంది. విరామం తర్వాత, సింధు త్వరగా తన ఆధిక్యాన్ని 4 పాయింట్లకు పెంచుకుంది. అదే ఊపులో 20-14తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో ఇద్దరు పోటాపోటీగా ఆడారు. హాఫ్ టైమ్‌కి 11-10తో స్కోర్ సమమైనా సింధు తన అనుభవాన్ని ఉపయోగించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రెండో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
#PVSindhu maiden title this year, 1st in 14 outings. The title drought is over. #SyedModiInternational2024 pic.twitter.com/rdGAF4wj16
— Uthra 🇮🇳 (@OnTheSportField) December 1, 2024








