భారత్ స్టార్ షెట్లర్ పీవీ సింధు (PV Sindhu) మునుపటి ఫామ్‌ను అందుకుంది. ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 (Syed Modi International Super 300) టోర్నీలో సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లక్నోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21–12,21–9 తేడాతో భారత్‌కే చెందిన ఉన్నతి హుడాపై (Unnati Huda) గెలుపొందింది. సింధు చెలరేగడంతో ఈ మ్యాచ్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది.
ఈ మ్యాచ్ తర్వాత సింధు ((PV Sindhu) మాట్లాడుతూ.. ‘నేటి ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండి కొన్ని మంచి షాట్లు ఆడాను. గేమ్ మొదటి నుంచి లీడ్ మెయింటెయిన్ చేశా. ఉన్నతి కూడా తన ఉత్తమ ప్రదర్శన చేసింది. కానీ నామీద పైచేయి సాధించేలా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆమెకు నా బెస్ట్ విషెస్. రేపటి ఫైనల్ సులువుగా ఉండకపోవచ్చు. మ్యాచ్ కోసం సిద్ధమై నా బెస్ట్ ఇవ్వాలి’ అని పేర్కొంది. ఫైనల్లో సింధు మాజీ ఛాంపియన్ చైనాకు చెందిన వు లివో యుతో తలపడనుంది.
మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ కూడా ఫైనల్‌కు చేరుకుంది. నాలుగో సీడ్ అయిన హాంగ్ జౌ–జియా యి యాంగ్ (చైనా)పై 21–16, 21–15 వరుస గేముల్లో విజయం సాధించారు. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
PV SINDHU MOVES INTO FINALS 🤩
Sindhu defeated compatriot Unnati Hooda 21-12, 21-9 in the Final of Syed Modi India International 2024.
WELL DONE 🇮🇳❤️pic.twitter.com/8nCOrqQu1A
— The Khel India (@TheKhelIndia) November 30, 2024








