Rachel Gupta: భారత్‌కు తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం

Mana Enadu: మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024(Miss Grand International 2024) అందాల పోటీల్లో భారత మహిళకు టైటిల్ దక్కింది. పంజాబ్‌(Punjab)కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా(Rachel Gupta) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ గ్రాండ్ టైటిల్‌ను పొందిన తొలి భారతీయురాలిగా రాచెల్ గుప్తా నిలిచింది. బ్యాంకాక్‌(Bangkok)లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ ఛాయిస్(Grand Pageants Choice Award 2024)’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ (2000) లారా దత్తా(Lara Dutta) సరసన చేరారు.

 గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రమోషన్

ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌(First Golden Crown)ను గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్(Miss Super Talent of the World)’ టైటిల్ కూడా సాధించారు. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వం(Global Ambassador Promoting Peace and Stability)పై ప్రచారం కల్పిస్తారు.

 చాలా చోట్ల మౌలిక సదుపాయాలు లేవు: రాచెల్ గుప్తా

రాచెల్(Rachel) మాట్లాడుతూ.. ‘‘నేను భారతదేశం నుంచి వచ్చాను. అక్కడ ప్రతి ఒక్కరికీ ఆహారం(Food), నీరు(Water), విద్య(Education), మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందనేది వాస్తవం. పరస్పరం పోరాడుకోవడం ఆపేసి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ తగినన్ని వనరులు సమకూరేలా చూడాల్సిన సమయం ఇది’’ అని చెప్పిన మాటలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. ఆమెను విజేతగా నిలబెట్టాయి’’ అని గుప్తా తెలిపారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *