అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ప్రపంచ దృష్టిని ఆకర్శించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant) జంట.. మరో ఘనత సాధించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ స్టైలిష్ లిస్ట్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ చోటుసంపాదించుకున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ (New York Times) తాజాగా వెల్లడించింది. వివాహ సమయంలో వారు ధరించిన దుస్తులు, నగలు, వైభవంగా జరిగిన వారి వివాహ వేడుకలు మొదలైన విషయాలను గరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది.
హాజరైన సెలబ్రిటీలు, ప్రముఖులు
ప్రపంచ కుబేరురుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కొడుకు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ వివాహం ఈ వివాహం ఈ సంవత్సరం జులై 12న అంగరంగ వైభవంగా సాగింది. వివాహంతోపాటు వివాహానికి ముందు, తర్వాత ఓ రేంజ్లో చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ వివాహానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరయ్యారు. వేడుకల్లో పాప్ సింగర్లు రిహన్నా, కేటీ పెర్రీ, ఆండ్రియా బోసెల్లి ప్రదర్శనలిచ్చి మెప్పించారు. మూడు రోజులపాటు జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల్లో అనంత్, రాధిక విలువైన ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకున్నారు.
హాజరైన వారికి విలువైన బహుమతులు
పెళ్లికి హాజరైన తన అత్యంత సన్నిహితులు సహా ఆత్మీయులు, తోడి పెళ్లి కొడుకులకు అనంత్ అంబానీ అత్యంత విలువైన బహుమతులు అందించారు. అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ బ్రాండ్‌కు చెందినటువంటి ఒక్కొక్కటి రూ. 2 కోట్ల విలువైన వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. అతిథుల కోసమే అంబానీ కుటుంబం ఈ వాచీలను ప్రత్యేకంగా సిద్ధం చేయించింది. బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఈ ఖరీదైన వాచ్‌లు అందుకున్నారు. ఆ వాచీలతో ఫొటోలకు పోజులు ఇచ్చారు.







