ALP: 5,696 ఉద్యోగాలు.. రైల్వేశాఖ కీలక ప్రకటన

రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) పరీక్షకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(స్టేజ్-2)కు కొత్త తేదీలను ప్రకటించింది. ఈ పరీక్ష ముందు షెడ్యూల్ ప్రకారం మార్చి 19, 20 తేదీల్లో స్టేజ్-2 పరీక్షలు జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌(Stage-2) వాయిదా పడింది. సవరించిన తేదీలు మే 2, 6. స్టేజ్-2 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డుల(Admit Cards)ను పొందవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన సెంటర్‌ వివరాలు పరీక్షకు 10 రోజులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో..

రైల్వేశాఖ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (స్టేజ్-1) ఫలితాలను, కట్‌ఆఫ్‌ మార్కుల(Cut off Marks)ను ఫిబ్రవరి 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టేజ్‌-1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేయగా మొత్తం 1,251 మంది స్టేజ్-2 పరీక్షకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్(Notification of Railway Department) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచింది. దీంతో 5,696గా ఉన్న ALP పోస్టుల సంఖ్య 18,799కి చేరింది.

RRB ALP Admit Card 2024: Exam city slip released on rrb.digialm.com. Check  steps to download | Today News

రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *