టీమ్ఇండియా(Team India) స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దాదాపు 13 తర్వాత తర్వాత రంజీ(Ranji Trophy-2025) బరిలో దిగాడు. రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో రైల్వేస్-ఢిల్లీ(Railways vs Delhi) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఢిల్లీ జట్టుకు ఆయుష్ బదోనీ(Ayush Badoni) సారథ్యం వహిస్తున్నాడు. కాగా 13 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ఆడుతున్న కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. అతడి రాకతో జట్టు బలం మరింత పెరిగింది. 2012, నవంబర్.. కోహ్లీ చివరగా ఆడిన రంజీ మ్యాచ్ తేదీ అది. విరాట్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడి దాదాపు 13 ఏళ్లు కావొస్తోంది. ఓవరాల్‌గా 23 రంజీ మ్యాచులు ఆడిన కోహ్లీ 1,547 పరుగులు చేశారు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కోహ్లీ ఈ మ్యాచులో ఆడుతుండటంతో స్టేడియానికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఇప్పటికీ గ్రౌండ్ బయట 2KMల మేర క్యూలో ఫ్యాన్స్ నిలుచున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ మ్యాచును ‘JIO CINEMA’ యాప్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
रणजी ट्रॉफी में 12 साल बाद विराट कोहली की वापसी को लेकर क्रेज.
.
.#ViratKohli𓃵 #RanjiTrophy #Virat pic.twitter.com/2yMOquxALV— CRICKET GURU (@GautamSing32370) January 30, 2025
విరాట్ రాకతో విజయంపై ధీమా
కాగా, ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ 17 పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కనుక గెలిస్తే బోనస్ పాయింట్ల(Bonus Points)తో కలుపుకొని 24 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. తమిళనాడు(Tamilnadu) జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి 25 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించి 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఎంట్రీ ఇవ్వడంతో గెలుపుపై ఆ జట్టు ధీమాగా ఉంది.
Aura Toh hai boss #ViratKohli𓃵 #RanjiTrophy pic.twitter.com/hrZBdERhGk
— Mayank Chahal (@MayankChahal11) January 30, 2025
On a chilly winter morning,
With too much cricket around the world,The craze for the domestic match seemed like this,
The reason? Virat Kohli.Show me anything better than this.
I bet you can’t.#RanjiTrophy #ViratKohli𓃵pic.twitter.com/zR5Mg5wIgG— Inside out (@INSIDDE_OUT) January 30, 2025








