బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisbane) వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు(3rd Test)లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుణుడి ఎఫెక్టుతో గత మూడు రోజులుగా ఆటకు అంతరాయం కలుగుతూనే ఉంది. దీంతో మూడు రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 51 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్(Captain Rohit) సేన బౌలింగ్ దారుణంగా విఫలమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 భారీగా స్కోరు సాధించింది. ఆ జట్టులో హెడ్ 152, స్మిత్ 101 సెంచరీలతో రాణించారు. అలెక్స్ క్యారీ 70 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లతో సత్తాచాటాడు.
భారత్‌ను ఆదుకున్న వరుణుడు?
వర్షంతో మూడోరోజు(Day Three) ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయానికి మైదానం చిత్తడిగా మారడంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. ఉదయం మ్యాచ్ ప్రారంభమైన వెంటనే మిచెల్ స్టార్క్ (18), అలెక్స్ క్యారీ దూకుడుగా ఆడారు. అయితే, బుమ్రా(Bumrah) అద్భుత బంతితో స్టార్క్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత వర్షం(rain) కారణంగా ఆటకు కాస్త అంతరాయం ఏర్పడింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. నాథన్ లైయన్ (2)ను సిరాజ్(Siraj) బౌల్డ్ చేశాడు. చివర్లో అలెక్స్ క్యారీ(70)ని ఆకాశ్ దీప్(Akashdeep) పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
ఇంకా 394 రన్స్ వెనుకబడి ఉంది
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్(Team India) ఎదురీదుతోంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ చాలాసార్లు నిలిచిపోయింది. అందుకే ఎర్లీగా టీ విరామాన్ని(Tea Break) కూడా తీసుకున్నారు. T బ్రేక్‌కు భారత్ 14.1 ఓవర్లలో 4వికెట్లకు 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ KL రాహుల్ (52 బంతుల్లో 30 బ్యాటింగ్, 4 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనకు కెప్టెన్ రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) సహకారం అందిస్తున్నాడు. అంతకుముందు జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేసి దారుణంగా విఫలమయ్యారు. స్టార్క్ 2, కమిన్స్, హేజిల్ వుడ్ చెరో వికెట్ తీశారు. భారత్ ఇంకా 394 రన్స్ వెనుకబడి ఉంది.








