పాన్ ఇండియా(Pan India) స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి 2898 ADతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు హారర్ కామెడీ జానర్‌లో డైరెక్టర్ మారుతి(Maruthi) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ది రాజాసాబ్(The RajaSaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్((Nidhi Agarwal)), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
డిసెంబర్ 5న రాజా సాబ్ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్‌లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌ను akattukundi. మారుతి, ఫ్యాన్స్ కోరుకున్నట్టే వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తూ, హారర్ కంటెంట్‌తో పాటు తన మార్క్ కామెడీని కూడా జోడించారు. దీంతో సినిమా వినోదం, థ్రిల్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తుందని అంచనాలు పెరిగాయి.
ఇది ప్రభాస్ కెరీర్‌లో హారర్ ఎలిమెంట్స్ ఉన్న తొలి చిత్రం. టీజర్‌లోని టైమింగ్, విజువల్స్, ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎక్సైట్ చేశాయి. టీజర్ ఈ స్థాయిలో ఇంప్రెస్ చేస్తే, ట్రైలర్ ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ, “మొదట సినిమా నాలుగున్నర గంటలుగా వచ్చింది. దానిని ఎడిట్ చేసి 3 గంటల లోపు లేదా 2 గంటల 45 నిమిషాల వరకు కుదించాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి” అని తెలిపారు.
తన కెరీర్‌లో రాజా సాబ్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని విశ్వప్రసాద్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, అలాగే కల్కి 2లో కూడా నటించనున్నాడు.






