ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొత్త సినిమాలకు సంబంధించిన లీక్స్ మరీ ఎక్కువయ్యాయి. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలు తీస్తున్న మేకర్స్.. ఈ లీకుల బెడతతో నిరాశ చెందుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు ఇలాంటి లీక్స్ వదలడం కరెక్ట్ కాదని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి పలు నిర్మాణ సంస్థలు. తాజాగా ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది.
ప్రభాస్(Prabhas) నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘రాజాసాబ్’(Raja Saab ) టీజర్‌ను జూన్ 16న విడుదల చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే టీజర్ లీక్ అయింది.
ఎవరో టీజర్‌ను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో, టీజర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తమైంది. లీక్‌లను గమనించిన వెంటనే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది.
సోషల్ మీడియాలో వారు ట్వీట్ చేస్తూ, “రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియా ఖాతాల్లోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ అకౌంట్లను సస్పెండ్ చేయిస్తాం. దయచేసి మాతో సహకరించండి” అని హెచ్చరించారు.
Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….
We request everyone to cooperate and stand with us in protecting the experience….
Let’s celebrate responsibly. Be aware. ⚠️
— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ పని చేస్తున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం వల్ల ఈ చిత్రానికి కొంత ఆలస్యం అవుతోంది. అయితే మరో మూడు రోజుల్లో రాబోయే టీజర్‌తో సినిమా కంటెంట్, టోన్ పట్ల స్పష్టత రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.






