ఈ మధ్య చాలా మందికి స్మార్ట్ ఫోన్(Mobile) చేతిలో ఉండే సరికి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీ (Celebrities)ల విషయంలో ఈ మధ్య అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు వారికి చిరాకు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియకుండా వారితో సెల్పీ(Selfies)ల కోసం ఎగబడుతూ వారి ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ అభిమానిపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి(SS Rajamouli) ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ ఏమైందంటే.. నిన్న నవరస నటుడు, నట కిరీటి కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మరణించిన విషయం తెలిసిందే.
అసహనానికి గురైన రాజమౌళి
ఈ సందర్భంగా ఆయన తెలుగు పరిశ్రమ(Telugu industry)కు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ టాలీవుడ్(Tollywood) ప్రముఖులంతా నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వచ్చారు. ఈ క్రమంలోనే రాజమౌళి తన సతీమణితో కలిసి కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని(Fan) చేసిన పని రాజమౌళికి కోపం తెప్పించేలా చేసింది. తన కారు వైపు వెళ్తున్న డైరెక్టర్‌ను ఓ అభిమాని సెల్ఫీ(Selfie) కోసం వెంటపడ్డారు. ఫొటో తీసుకునేందుకు ఆయన కారు వరకు వెళ్లాడు. దీంతో అసహనానికి గురైన రాజమౌళి ఏంటిది? అంటూ అతన్ని తోసేశాడు. ఇది చూసిన నెటిజన్స్ అభిమానిపై మండిపడుతున్నారు. వచ్చిన సందర్భం ఏంటో తెలుసుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడడం ఏంటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram






