
సీనియర్ నటుడు, కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warmer)కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా(SM) వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood) ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో వార్నర్‌పై ఆయన చేసిన కామెంట్స్‌పై విమర్శలు రాగా.. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
నితిన్, వార్నర్ నాకు పిల్లల్లాంటివారు..
తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. సరదాగా తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని రాజేంద్రప్రసాద్ అన్నారు. ”I LOVE DAVID WARNER. I LOVE CRICKET’. డేవిడ్ వార్నర్ మన సినిమాలు, నటనను ఇష్టపడతారు. ఈ సినిమాతో ఒకళ్లకు ఒకళ్లం బాగా క్లోజ్ అయిపోయాం. నితిన్, వార్నర్ నాకు పిల్లల్లాంటివారు. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుంటాను.’ అంటూ వీడియోలో చెప్పారు.
డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3
— Milagro Movies (@MilagroMovies) March 25, 2025
రేయ్ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ..
కాగా ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. ఆయన ఈ మూవీలో గెస్ట్ రోల్(Guest Role) చేశారు. ఈ వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ సైతం ప్రసంగించారు. ఈ సందర్భంగా వార్నర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వార్నర్ క్రికెట్ ఆడమంటే పుష్ప సినిమాలో స్టెప్పులు వేస్తున్నాడంటూ తెలిపారు. ‘దొంగ…. కొడుకు మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ కామెంట్ చేశారు. అయితే, తెలుగు తెలియని వార్నర్ ఈ వ్యాఖ్యలకు సరదాగా నవ్వుకున్నాడు. కానీ ఆయన వ్యాఖ్యలు వార్నర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు.
డేవిడ్ వార్నర్ దొంగా ముం**కొడుకు
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్.
రాబిన్ హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడినా రాజేంద్ర ప్రసాద్.#Robbinhood pic.twitter.com/clRbieT3Od
— Telangana365 (@Telangana365) March 24, 2025
ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు ‘రాబిన్‌హుడ్’
దీంతో ఆయనపై వార్నర్.. తెలుగు సంస్కృతి, సినిమాలను చాలా ఇష్ట పడతారని.. అలాంటి వ్యక్తిని అవమానించడం ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఆయన సినిమాపై అభిమానంతో ప్రత్యేక అతిథి(Special Guest)గా ఈవెంట్‌కు వచ్చారని.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొందరు విమర్శించారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్.. తన కామెంట్స్ పట్ల క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నానన్నారు. నితిన్(Nitin), శ్రీలీల(Sreeleela) జంటగా వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.