Mana Enadu : ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth). వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా తలైవా నటించిన చిత్రం ‘వేట్టయన్’ (Vettaiyan). జై భీమ్ ఫేం టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీలో తలైవా పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించారు.
ఓటీటీ రిలీజ్ కు రెడీ
ఎన్నో అంచనాల మధ్య వేట్టయన్ అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ మూవీని మరోసారి చూడాలనుకనే వారికి, థియేటర్ లో చూడటం మిస్ అయిన వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ (Vettaiyan Ott news) రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు.
నవంబర్ 8న ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా వేట్టయన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీకెండ్ కు తలైవా యాక్షన్ ను కుటుంబం, స్నేహితులతో కలిసి జాలీగా ఎంజాయ్ చేయండి.
కథే ఇదే:
న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడని అథియన్ (రజనీకాంత్) ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. ఆయణ్ను శరణ్య (దుశారా విజయన్) అనే ఓ స్కూల్ టీచర్ హత్య కలచివేస్తుంది. ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులపైనా ఒత్తిడి పెరుగడంతో అథియన్ రంగంలోకి దిగుతాడు. ఆ కేసు ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే అథియన్ హంతకుడిని మట్టుబెడతాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేమిటి? మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ ఎన్‌కౌంటర్‌ని ఎందుకు తప్పుపట్టాడు? అసలు శరణ్య హత్య వెనక ఎవరున్నారు? తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.






