Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ముందుకు రానున్నాడు. జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇటీవలే డల్లాస్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్న చెర్రీకి ఈ చిత్రంతో సూపర్ హిట్ అవ్వాలని విజయవాడ ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
256 అడుగుల భారీ కటౌట్
విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కటౌట్ (Ram Charan Cutout) ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 256 అడుగుల కటౌట్ ఇంటర్నేషనల్ వండర్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డు అందుకున్నారు. ఈరోజు సాయంత్రం కటౌట్ ఆవిష్కరించి.. హెలికాప్టర్ ద్వారా కటౌట్‌పై పూలు వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
India’s Biggest Cut out 🔥😎#GameChangerBiggestCutout pic.twitter.com/QNV4VxIh7F
— RamCharan Fans™️ (@RamCharan_HCF) December 29, 2024
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్
రామ్‌చరణ్ సినిమాల విషయానికొస్తే దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో మరో చిత్రానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేయనుంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీలో చెర్రీ సరసన కియారా అడ్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఇప్పటికే ఈ కాంబోలో వినయ విధేయ రామ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
India’s BIGGEST 2⃣5⃣6⃣ft Ram Charan cut out launched🚁 pic.twitter.com/lUfubsQwfe
— Manobala Vijayabalan (@ManobalaV) December 29, 2024






