‘RC16 సెట్’కు లిటిల్ గెస్ట్.. ఫొటో వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. ఇందులో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక తాజాగా రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

RC16 సెట్ కు లిటిల్ గెస్టు

ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana)తో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) నటిస్తోంది. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో జరుగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూట్‌ లొకేషన్‌ ఫొటో ఒకటి నెట్టింట షేర్ చేశాడు రామ్ చరణ్. ఆర్సీ16 మూవీ సెట్స్ లోకి లిటిల్ గెస్ట్ వచ్చిందని చెర్రీ ట్వీట్ చేశాడు.

క్లింకారతో చెర్రీ ఫొటో వైరల్

తన కుమార్తె క్లింకార తన సినిమా షూటింగ్ సెట్ కు వచ్చినట్లు తెలిపాడు. క్లింకార(klinkara)ను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశాడు. మై లిటిల్‌ క్యూట్ గెస్ట్‌ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ లొకేషన్‌ ఎక్కడనేది పక్కన పెడితే తండ్రీకూతుళ్ల ఫొటో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక షూటింగ్ సెట్ చూసి రంగస్థలం సెట్ లా ఉందని అంటున్నారు. ఆ సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది(Peddi)’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

సుకుమార్ తో ఆర్సీ17

ఆర్‌సీ 16 షూటింగ్‌ను జులై వరకు పూర్తి చేసి.. ద‌స‌రా లేదా డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ రైటింగ్స్‌‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఆర్‌సీ17 (RC17) ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే‌.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *