‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే?

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.47 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే రూ.38 కోట్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ‘గేమ్‌ ఛేంజర్‌ (Game Changer Collections)’కు తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో వెల్లడించింది. ఇక ఇవాళ శని, రేపు ఆదివారం కావడంతో ఈ వీకెండ్ లో టికెట్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

అప్పన్న పాత్ర అదిరెన్

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మించారు. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ (Ram Charan) నటనపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi On Game Changer), చెర్రీ సతీమణి ఉపాసన, సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ ఈ సినిమా చూసి చెర్రీపై ప్రశంసలు కురిపించారు.

కంగ్రాట్స్ డియర్ హస్బెండ్

‘‘అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలకుగానూ చరణ్‌పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది. ఎస్‌.జె. సూర్య, కియారా అడ్వాణీ, అంజలి, నిర్మాత దిల్‌ రాజు (Dil Raju), దర్శకుడు శంకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇక ‘‘కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌. ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్‌ ఛేంజర్‌. లవ్‌ యూ’’ అని ఉపాసన నెట్టింట ఓ పోస్టు పెట్టారు. ‘‘అప్పన్న పాత్రలో అద్భుతంగా నటించావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకు ప్రాణం పోశావు. నీ పర్ఫామెన్స్ చూస్తుంటే ఒక కలలా అనిపించింది. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగావు.’’ అని సాయి దుర్గాతేజ్‌ పోస్ట్‌ పెట్టారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *