గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ రాజమౌళి (Rajamouli) తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ (Game Changer Trailer Release) విడుదల చేశారు.
కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో చరణ్ నటన, డైలాగ్స్, అంజలి యాక్టింగ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తమన్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ‘కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు… ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు’ వంటి డైలాగ్స్ ట్రైలర్ కు ఆకర్షణగా నిలిచాయి.






