పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది నటి షాజన్ పదంసీ (Shazahn Padamsee). ఆ సినిమాలో చేసింది చిన్న క్యారెక్టరే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇంతకీ ఇప్పుడు ఈమె గురించి ఎందుకంటారా..?

షాజన్ పెళ్లి ఫిక్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇలా వచ్చి మాయ చేసి అలా వెళ్లి పోయిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. తన ప్రియుడితో ఈ భామ వెడ్డింగ్ ఫిక్స్ అయింది. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆశిష్ అనే వ్యాపారవేత్తతో షాజన్ త్వరలో వివాహ బంధంలో (Shazahn Padamsee Wedding)కి అడుగుపెట్టబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee)

కొత్త ప్రయాణం ప్రారంభం

తన ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసిన షాజన్.. జనవరి 20వ తేదీన కొత్త ప్రయాణం ప్రారంభమైంది అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లోనే అశీశ్ తనకు ప్రపోజ్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేసింది ఈ భామ. కాగా వీరి వివాహం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *