గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ram charan) తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబుతోపాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పుడు ఈ చిత్రానికి మరో క్రేజీ యాక్టర్‌ను తీసుకున్నట్లు వృద్ధి సినిమాస్ ప్రకటించింది. మీర్జాపూర్ (mirzapur) వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు దివ్యేందు శర్మ (divyendu sharma) అలియాస్ మున్నా భయ్యాని తీసుకున్నట్లు వెల్లడించింది. ‘మన ఫేవరేట్ మున్నా భయ్యా ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర పోషించనున్నాడు’ అని ప్రకటించింది. RC16 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో దివ్యేందు శర్మ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
మున్నా భయ్యా నెగిటివ్ రోల్లో కనిపిస్తాడా లేదా ఇంకేదైనా కీ రోల్ చేస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు (buchi babu) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో ప్రారంభమైంది. చరణ్ ఈ నెలాఖరు నుంచి కెమెరా ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దేవర సినిమాతో ఆకట్టుకున్న జాహ్నవి కపూర్‌ని హీరోయిన్గా తీసుకునే అవకాశాలున్నాయని సిని వర్గాలు చర్చించుకుంటున్నాయి