గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో అప్పన్న పాత్రలో చెర్రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. డ్యూయెల్ రోల్లో చెర్రీ తన నటనతో మెప్పించినా.. ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
ఆర్సీ 16 నయా షెడ్యూల్
ఇక రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. ‘ఆర్సీ 16 (RC16)’ అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరగనుంది.
పెద్ది టైటిల్‌తో ఆర్సీ 16
రాత్రి వేళలో సాగే ఈ షెడ్యూల్లో చెర్రీతో పాటు మరికొందరు తారలు పాల్గొననున్నారు. కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ ఓ స్పెషల్ సెట్ ను డిజైన్ చేశారట. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘పెద్ది (Peddi Movie)’ అనే పేరును ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జాన్వీతో చెర్రీ
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించనుంది. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






