Ram Charan vs Nani: చెర్రీ ‘పెద్ది’తో నాని ప్యారడైజ్ ఢీ.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదా?

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విజయాలతో పాటు మాస్ ఇమేజ్‌ను కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చివరగా వచ్చిన హిట్-3(HIT 3) అతని కెరీర్‌లోనే కాక టాలీవుడ్‌లోనే మోస్ట్ వయొలెంట్ మూవీ అనిపించుకుంది. మరి ఈ కాన్ఫిడెన్స్ వల్లో లేక ఇంకేదో కారణమో కానీ.. అతను రామ్ చరణ్‌(Ram Charna)తో పోటీకి సై అంటున్నాడు. అఫ్ కోర్స్ ఈ పోటీలో ముందుగా నిలబడింది నానినే. ఇంతకీ విషయం ఏంటంటే.. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన దసరా(Dasara) సూపర్ హిట్ అయింది. అందుకే ఈ ప్యారడైజ్ పై అంచనాలున్నాయి. జూన్ ఆరంభంలోనే చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. కానీ కాస్త ఆలస్యం అయింది.

ది ప్యారడైజ్ షూటింగ్ స్టార్ట్

ఈ మూవీ కోసం 1980ల కాలం నాటి హైదరాబాద్(Hyd)లోని ప్యారడైజ్ పరసరాలు ప్రతిబింబించేలా ఓ భారీ సెట్ వేశారు. మెజారిటీ షూటింగ్ అక్కడే చేయబోతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి నాని అడుగుపెట్టాడు అనీ.. ది ప్యారడైజ్ షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్‌(Poster)తో పాటు ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ ఓపెనింగ్ టైమ్‌లోనే రిలీజ్ డేట్ కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత అదే టైమ్‌కు రామ్ చరణ్ ‘పెద్ది(Peddi)’ని అనౌన్స్ చేశారు.

వచ్చే మార్చి 27న పెద్ది విడుదలకు ప్లాన్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు(Bucchibabu) డైరెక్షన్‌లో రూపొందుతోన్న పెద్ద చిత్రాన్ని కూడా మార్చి 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్క రోజే గ్యాప్ ఉన్నా.. పెద్దిపై ఇప్పటి నుంచే ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు చాలామంది. ఇటు దసరా మూవీ నైజాంలో చేసినంత బాగా మిగతా ఏరియాస్‌లో వసూళ్లు చేయలేదు. ఓ రకంగా శ్రీకాంత్ ఓదెల కంటే బుచ్చిబాబుకే ఎక్కువ స్పేస్ కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ ఉన్నా.. లాస్ కూడా ఎవరో ఒకరికి కనిపిస్తోంది. అయితే నాని కొంత గ్యాప్ తీసుకున్నా డేట్ మార్చేది లే అని ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈ క్లాష్ చివరి వరకూ ఉంటుందా లేక మధ్యలో డేట్స్ మారతాయా అనేది చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *