తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్ వేయాలని ఆయనను ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రామచందర్‌కు RSS అండ
కొంతకాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆ పార్టీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ముఖ్యంగా ఎంపీ ఈటల రాజేందర్, రామచందర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్ పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచందర్‌రావు వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ఆ పేరును ఖరారు చేసింది. ఆరెస్సెస్‌తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. అటు ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు పీవీఎన్ మాధవ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
📢 BREAKING: New BJP state chiefs to be appointed.
~ N Ramchander Rao to be the President of Telangana BJP.
~ PVN Madhav set to take over as the President of Andhra BJP.Countdown to next BJP National Chief Officially Begins⏳ pic.twitter.com/1UcRIeqNKs
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 30, 2025






