
బాలీవుడ్(Bollywood)లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ మొదటి గ్లింప్స్(Glimpse) ఈ రోజు (జులై 3) విడుదల కానుంది. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణంలో రూపొందుతోన్న ఈ భారతీయ పౌరాణిక చిత్రం(Indian mythological film) రెండు భాగాలుగా (తొలి పార్టు 2026, రెండో పార్టు 2027) దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, యష్(Yash) రావణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా, లారా దత్త(Laura Dutta) కైకేయిగా, అరుణ్ గోవిల్(Arun Govil) దశరథుడిగా నటిస్తున్న ఈ చిత్రం సుమారు రూ. 835 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 11:30 గంటలకు ఏకంగా 9 నగరాల్లో..
కాగా ఈ మూవీ గ్లింప్స్(Glimpse)ను ఈ రోజు బెంగళూరులోని PVR ఫోరమ్ మాల్‌లో ఉదయం 11:30 గంటలకు గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. కాగా, ఇండియా వ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్‌ను బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లోని పలు థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో మూడు నిమిషాల పాటు సాగే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసే ఛాన్సుంది.
Huge hype for a Bollywood film in both South and North, for #Ramayana. Truly a Pan-India cinematic event. @Sai_Pallavi92 ❤️❤️#RamayanaTheIntroduction #RanbirKapoor #Yash #SaiPallavi #RamayanaMovie
#Ramayana pic.twitter.com/1W9v2kVA2X— @Sai_Pallavi_™ (@Sai_Pallavi_DFC) July 3, 2025
ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో, ఆస్కార్ విజేత DNEG స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్‌తో, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతంతో రూపొందుతోంది. సోషల్ మీడియా(Social Media)లో ఈ గ్లింప్స్‌పై ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ తొలి పార్ట్ షూటింగ్ పూర్తికాగా.. రెండో పార్ట్ షూటింగ్(Second Part) వచ్చే నెల ప్రారంభం కానుంది.