బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసు(Betting Apps Promotions Case) విచారణకు హాజరయ్యేందుకు సినీ నటులు రానా దగ్గుబాటి(Rana Daggubati), మంచు లక్ష్మి(Manchu Laxmi) ఈడీ(Enforcement Directorate)ని గడువు కోరారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరు కావాలని వీరితో పాటు ప్రకాశ్ రాజ్(Prakash raj), విజయ్ దేవరకొండలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ED నోటీసు మేరకు ఈరోజు (జులై 23) రానా దగ్గుబాటి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్ నిమిత్తం సమయం కావాలని ఆయన కోరారు. షూటింగ్ బిజీ కారణంగా తన షెడ్యూల్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు. అటు మంచు లక్ష్మి ఆగస్టు 13న ED అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను కూడా ఆ రోజు హాజరు కాలేనని మంచు లక్ష్మి ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా..
కాగా ఈ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ జులై 30న, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఆగస్టు 6న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ జరుపుతోంది. 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా సెలబ్రిటీల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
The Enforcement Directorate has summoned actors Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda, and Manchu Lakshmi to appear before it in the case relating to alleged promotion of illegal betting apps.https://t.co/kZUHx9doIN
— The Siasat Daily (@TheSiasatDaily) July 22, 2025






