విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), దగ్గుబాటి రానా(Daggubati Rana) కలిసి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు(Rana Naidu)’. 2 ఏళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో విడుదలైన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2(Rana Naidu-2)’ను రూపొందించారు. నిన్న (మే 20) ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. సుందర్ ఆరోన్(Sundar Aaron), లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్(Karan Anshuman) క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు.
ఫస్ట్ సీజన్‌కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్
కాగా ఫస్ట్ సీజన్(First Season)కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఎరోటిక్ సీన్స్, అడల్ట్ డైలాగ్స్ ఎక్కువ అయ్యాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన మిక్స్డ్ టాక్‌తో పాటు వెంకటేష్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి బోల్డ్ కంటెంట్(Bold Content) తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
Rana Naidu Season 2 🔥#rananaidu #ranadaggubati #venkatesh #webseries #indianwebseries #netflixoriginal #netflixseries #netflix #netflixandchill #ottinformer pic.twitter.com/qL3qcZEakI
— OTT Informer (@OTTInformer) May 21, 2025






