
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’ చిత్రంలో రాశీ ఖన్నా(Rashi Khanna) రెండో కథానాయకిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) మొదటి కథానాయకిగా నటిస్తుండగా, రాశీ ఖన్నా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాశీ ఎంట్రీ ఆమె అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
చాలాగ్యాప్ తర్వాత బిగ్ ఛాన్స్
రాశీ ఖన్నా, తెలుగు చిత్రసీమలో ‘ఊహలు గుసగుసలాడే(Uhalu Gusagusalaade)’తో ఆరంభంలో మంచి గుర్తింపు పొందారు. అయితే పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాల తర్వాత తెలుగులో మరో సినిమా అవకాశం అందుకోలేదు. చాలాగ్యాప్ తర్వాత తాజాగా పెద్ద అవకాశం అందుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గడంతో ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఈ అవకాశం ఆమె కెరీర్‌కు బూస్ట్ ఇవ్వనుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
పవన్-హరీష్ కాంబోలో రెండో చిత్రం
‘గబ్బర్ సింగ్(Gabbar singh)’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాశీ ఇప్పటికే సెట్స్‌లో చేరారని, కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్(Devisri prasad) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. రాశీ ఖన్నా ఈ పాత్రతో తన సత్తా చాటి, తెలుగు సినిమాల్లో మళ్లీ స్థానం సంపాదిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Sakshi Vaidya is replaced with Raashii Khanna as second lead in Ustaad Bhagat Singh…#PawanKalyan #Sreeleela #RaashiiKhanna #UstaadBhagatSingh pic.twitter.com/JngMIIUhBt
— Hari K 👑 (@brahmi_fan) July 19, 2025