‘కుబేర’తో రష్మిక మందాన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌ను ఆస్వాధిస్తున్న రష్మిక ప్రస్తుతం నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ రవీంద్రన్ బర్త్ డే (జూన్ 23) సందర్భంగా రష్మిక ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్‌పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేసింది. సినిమాపై రాహుల్‌కు ఉన్న అభిరుచిని కూడా పంచుకుంది.
హ్యాపీ బర్త్ డే రాహుల్ సర్..
‘రాహులా.. ఈ రోజు (జూన్ 23) నీ బర్త్ డే. అయినా నువ్వు ఇంకా రిహార్సల్స్ చేస్తూనే ఉన్నావు. నేను నీ కోసం పోస్ట్ వేస్తున్నా.. నా ముందు మాత్రం నువ్వు ఇంకా రిహార్సల్స్ చేస్తూనే ఉన్నావు. నువ్వు నా జీవితంలో ఎంతో విలువైన స్నేహితుడివి.. గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాను తీశావంటే ఇంకా నమ్మలేకపోతోన్నా.. నీ హృదయంలో ఇన్ని లోతైన భావాలున్నాయా..? సినిమాపై ప్రతీ ఫ్రేమ్ మీ మనసుని ప్రతిబింబించేలా ఉంది.. ది గర్ల్ ఫ్రెండ్ కోసం నిన్ను కలిస్తే నాకు ఓ మంచి దర్శకుడు, స్నేహితుడు, మెంటర్, పార్ట్నర్ ఇన్ క్రైమ్ దొరికాడు. నీ మీద నాకు ఎంతో అపారమైన నమ్మకం, గౌరవం ఏర్పడింది. హ్యాపీ బర్త్ డే రాహుల్ సర్. గర్ల్ ఫ్రెండ్‌ని ఈ ప్రపంచం ఎప్పుడెప్పుడు చూస్తుందా? అని వెయిట్ చేస్తున్నా.. ఇది నాకెంతో ప్రత్యేకం’ అని రష్మిక పోస్ట్ వేశారు.
View this post on Instagram
మరో కొత్త యాంగిల్‌లో..
గర్ల్ఫ్రెండ్లో రష్మికను మరో కొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేయబోతోన్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్లు అయితే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. రష్మికకు మరో కొత్త పాత్ర దక్కిందని, నటిగా మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుందని మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు.






