విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom)’ చిత్రం నిన్న (జులై 31) విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్, 1990ల శ్రీలంక నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంపై నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్(Emotional post) పెట్టింది. “ఈ విజయం నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు @thedeverakonda ! ‘మనం కొట్టినం’ #Kingdom,” అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
“MANAM KOTTINAM”🔥#Kingdom
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
లవ్ ప్రపోజ్ చేయాలని కామెంట్స్
విజయ్ దేవరకొండ కూడా రష్మిక పోస్ట్‌కు స్పందిస్తూ, “మనం కొట్టినం!” అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఈ హ్యాపీ మూమెంట్‌లో రష్మికకు విజయ్ లవ్ ప్రపోజ్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ టీట్లతో వారి మధ్య సన్నిహిత సంబంధం గురించిన చర్చలు మరోసారి ఊపందుకున్నాయి.

మీ ప్రేమ, వెంకన్న స్వామి ఆశీస్సుల వల్లే: విజయ్
‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ కెరీర్‌లో కీలకమైనదిగా నిలిచింది. గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ సినిమాతో విజయ్ బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్(Success Celebrations)లో విజయ్ మాట్లాడుతూ “ఈ సక్సెస్ మీ ప్రేమ, వెంకన్న స్వామి ఆశీస్సుల వల్లే సాధ్యమైంది” అని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్(Satyadev), వెంకిటేష్‌లు కీలక పాత్రల్లో నటించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.






