భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా అతడు హఠాత్తుగా (Ashwin retirement) రిటైర్మెంట్ ప్రకటించడం ఒక్కసారిగా క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే జట్టులో ఉన్న అంతర్గత కారణాలు, ఒత్తిడి కారణంగానే అతడు రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశ్విన్ ((Ashwin Father) తండ్రి రవిచంద్రన్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. వేధించడంతోనే తన కుమారుడు టీమ్ నుంచి తప్పుకున్నాడని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. అశ్విన్ రిటైర్మెంట్‌కు చాలా కారణాలు ఉండొచ్చునని, అవి ఏంటనేది కేవలం అతడికే తెలియాలి అని అన్నారు. తన కొడుకుని టార్చర్ పెట్టారని.. ఇంకా ఎన్నేండ్లు వేధింపులు సహించాలనే ఫ్రస్ట్రేషన్‌లోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కొడుకును చాలా కాలంగా హింసిస్తున్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే భయం నాకు కూడా ఉంది. ఇప్పుడు అదే నిజమైంది. వేధింపులు ఇంకెంతకాలం సహించగలడు. వాటిని తట్టుకోలేకే అతడు ఈ నిర్ణయానికి వచ్చాడు’ అని అన్నారు. అయితే అశ్విన్‌ను వేధించిది ఎవరు? టీమ్ మేనేజ్‌మెంటా లేక సహచర ఆటగాళ్లా? మరెవరైనా అనేది మాత్రం రవిచంద్రన్ బయటపెట్టలేదు.
‘అశ్విన్ రిటైర్మెంట్ గురించి నాకు ఆలస్యంగా తెలిసింది. అతడి మైండ్‌లో ఏం నడుస్తోందో నాకూ తెలియదు. రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ అతడి నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. ఎంతో ఒత్తిడి కారణంగా నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు నేనేమీ బాధపడటం లేదు. అతడు రిటైర్మెంట్ గురించి అతడు ప్రకటించిన తీరు ఒకింత సంతోషం కలిగించినా.. ఎక్కువగా బాధకు గురిచేసింది. ఎందుకంటే ఇంకొన్నాళ్లపాటు ఆటలో కొనసాగాల్సింది. ఎక్కడో ఏదో జరిగింది’ రవిచంద్రన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాయి.








