
చూస్తుండగానే మార్చి(March) మంత్ ముగింపునకు వచ్చేసింది. మరో 5 రోజుల్లో మార్చికి సెండాఫ్ చెప్పేసి ఉగాది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్(April)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్(Financial Year) కూడా ప్రారంభం కానుంది. అలాగే కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget)లోని ట్యాక్స్ శ్లాబులు సైతం ఏప్రిల్ ఫస్ట్ నుంచే అమలు కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బ్యాంకులు సైతం తమ వర్కింగ్ డేస్, హాలిడేస్(Holidays)ను ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు సెలవుల జాబితా(Bank Holidays List)ను ప్రకటించింది.
ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
☛ ఏప్రిల్ 6: ఆదివారం – శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 10: గురువారం – జైనమత 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి
☛ ఏప్రిల్ 12: రెండో శనివారం
☛ ఏప్రిల్ 13: ఆదివారం
☛ ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి
☛ ఏప్రిల్ 15: బోహాగ్ బిహు పండుగ సందర్భంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 20: ఆదివారం
☛ ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
☛ ఏప్రిల్ 26: నాలుగో శనివారం
☛ ఏప్రిల్ 27: ఆదివారం
☛ ఏప్రిల్ 29: పరశురామ జయంతి
☛ ఏప్రిల్ 30: బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు
సో.. ఈ హాలిడేస్‌ని మైండ్‌లో పెట్టుకొని మీ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా ప్రణాళిక రూపొందించుకోండి.