తాను నటించిన ‘శ్రీమంతుడు(Srimanthudu)’ సినిమాకు గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) స్పందించాడు. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్స్ అవార్డుల(Gaddar Film Awards) పట్ల హర్షం వ్యక్తం చేశాడు. “శ్రీమంతుడు, మహర్షి, మేజర్ వంటి చిత్రాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించి, సినీ పండుగలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాల విజయానికి కారకులైన నా దర్శకులకు మరింత ప్రేమను తెలియజేస్తున్నాను” అని మహేశ్ బాబు పేర్కొన్నారు.
Grateful..♥️ pic.twitter.com/YGccagcPqF
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2025
చాలా ఆనందంగా ఉంది: డైరెక్టర్ సుకుమార్
అటు ప్రముఖ దర్శకుడు సుకుమార్(Director Sukumar) కూడా గద్దర్ అవార్డుల పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. “ప్రతిష్ఠాత్మకంగా భావించే గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో భాగంగా నాకు BN రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా ఉంది. ఇంత గొప్ప అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని(TG Govt)కి, గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని సుకుమార్ తెలిపారు. కాగా శుక్రవారం 2014-2023 వరకు గల ఉత్తమ చిత్రాల(Best Movies)కు గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.







