jr NTR: వార్ 2 కోసం ఎన్టీఆర్‌కు రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్.. నందమూరి వారసుడి రేంజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్(jr NTR) అంటేనే ఓ మాస్ బ్రాండ్. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం తెలుగు చిత్రసీమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే టాప్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు. ఇటీవలే దేవర సినిమా ద్వారా విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు రెండు బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

వాటిలో ఒకటి కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న డ్రాగన్(Dragon) మూవీ. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది.

ఇక మరోవైపు, ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి వార్ 2(War2) అనే భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ(Ayaan Mukarji) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, హై బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. రెండు ఇండస్ట్రీల నుంచి వచ్చిన టాప్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది.

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్‌లో ఆయన స్టైల్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించేందుకు దాదాపు రూ.60 కోట్ల రెమ్యూనరేషన్(Remunaration) తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక సౌత్ స్టార్‌కు బాలీవుడ్‌లో తొలి సినిమాలోనే ఈ స్థాయి పారితోషికం ఇవ్వడం అంటే, ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *