తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (thug life) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ ను అడ్డుకునేలా కనిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కమల్ హసన్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కమల్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ విడుదల ఆపాలని థియేటర్ల యజమానులను హెచ్చరిస్తున్నారు.
ద్రవిడ భాషకు మూలం తమిళం అని వ్యాఖ్యలు
థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ (kamal hasan) మాట్లాడుతూ.. ‘కన్నడ తమిళ భాష నుంచి పుట్టింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ భాష సంఘాలు, సీఎం సిద్ధరామయ్య (sidda ramayya) కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ద్రవిడ భాషల చరిత్రపై కమల్ మాట్లాడుతూ ‘కన్నడ, తెలుగు, మలయాళం భాషలు తమిళం నుంచి పుట్టినవే అని వ్యాఖ్యానించారు. తమిళం అనేది ద్రావిడ భాషలకు మూలం అని ఆయన అన్నారు. దీంతో కన్నడ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ముదిరిన వివాదం
బెంగళూరుతో (bengaluru) పాటు మైసూరు, హుబ్లీ తదిరత పట్టణాల్లో థగ్ లైఫ్ సినిమాను నిలిపివేయాలని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబడుతున్నారు. కాగా కమల్ హసన్ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. నేను చెప్పింది చరిత్రలో ఉన్నదే అని వ్యాఖ్యనించారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. ఈ సినిమాకు నిర్మాతగా కమల్ హసన్ వ్యవహరిస్తుండటంతో ఆయన వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం కూడా స్పందించారు. కమల్ కు కన్నడ భాష గురించి ఏమీ తెలియదని తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.






