దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన ప్రీపెయిడ్ ప్లాన్(Prepaid plan)లలో వరుసబెట్టి మార్పులు చేస్తోంది. ఇప్పటికే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. తాజాగా రూ.799 ప్లాన్‌ను కూడా నిలిపివేసింది. దీంతో ఈ ప్లాన్ కింద డేటా, కాలింగ్, SMS సేవలను పొందుతున్న వినియోగదారులు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.799 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభించేవి.

అయితే, ఇకపై అదే ప్రయోజనాల కోసం వినియోగదారులు రూ.889 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అదనంగా JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌తో 5G సేవలు అందుబాటులో ఉండవు.
ప్రత్యామ్నాయంగా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్
మరో ప్రత్యామ్నాయంగా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు JioCinema లేదా Hotstar Mobile/TV సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు కూడా 5G సదుపాయం లేదు. గత ఏడాది నుంచి రోజుకు 2GB డేటా అందించే ప్లాన్‌లకే జియో 5G సదుపాయాన్ని అందిస్తోంది. కాగా ఇటీవల ఎయిర్‌టెల్(Airtel) కూడా రూ.249 ప్లాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే.
📢Jio has removed the ₹799 plan ❌ (1.5GB/day, 84 days validity)
Instead ₹889 is available with validity with savanpro subscription what is that? #jio #RelianceJio #Telecom pic.twitter.com/Vi94CJSARf— Aman Gupta (@theamangupta_1) August 21, 2025






