ధార్మిక జీవనశైలే వివాహ బంధాల్ని నిలబెడుతుందని హెచ్ఎం యూరోప్ ప్రతినిధి కొమ్మూరి గిరి రావు (Kommuri Giri Rao) పేర్కొన్నారు. తాజాగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ (Frankfurt) కేంద్రంగా ‘ధార్మిక జీవన శైలీ-దాంపత్య జీవనం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అతిపెద్ద పరిచయ వేదికలో యూరోప్ (Europe) మొత్తం నుంచి పెద్ద ఎత్తున యువతీయువకులు పాల్గొన్నారు. ఈ మేరకు యువతను ఉద్దేశించి కొమ్మూరి గిరి రావు ప్రసంగించారు. ‘‘ఆధ్యాత్మికత (Spirituality), నీతి విలువలు, పరస్పర గౌరవం వివాహ జీవితం (married life)లో స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. ధార్మిక జీవనం దంపతులకు సహనం, క్షమాగుణం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణాన్ని అలవరుస్తుంది. కుటుంబ విలువలను గౌరవించే జీవనశైలి సంఘర్షణలను తగ్గిస్తుంది. ఈ తరహా జీవనశైలి విశ్వాసం, సామరస్యాన్ని పెంపొందిస్తూ వివాహ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
సంప్రదాయలు, సంస్కృతి గురించి తెలుసుకుంటేనే..
అలాగే మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయలు (Traditions), సంస్కృతి (Culture) పూర్తిగా తెలుసుకుంటే దాంపత్యం బలంగా ఉంటుందని ఈ లక్ష్యంతోనే భారతీయత, ధార్మికతపై అవగాహన ఉన్న యువత కోసం యూరోప్‌తో పాటు ప్రపంచ దేశాల్లో తమ సంస్థ పరిచయ వేదికలు ఏర్పాటు (Introduction Platforms) చేస్తోందని తెలిపారు. దంపతులు ఓవైపు ఉద్యోగాలను ఓవైపు చేస్తూనే మరోవైపు వైవాహిక బంధాల్లో మార్పు తెచ్చేందుకు స్వచ్ఛందంగా, ఏ లాభాపేక్ష లేకుండా జర్మనీలో HMUSA మద్దతు, విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో ఇలాంటి కార్యక్రామలను విస్తృతం చేస్తున్నామని తెలిపారు.






