‘బలగం’ సినిమాలో పాటపాడి నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) (Balagam Mogilaiah) మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో జబర్దస్థ్ వేణు తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) సినిమా విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో (Mogilaiah) మొగిలయ్య ఓ భావోద్వేగభరితమైన పాట పాడి హృదయాలను హత్తుకున్నారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.
BALAGAM TV NEWS UPDATES
ఆశ్రునివాళీ బలగం మొగిలయ్యకు బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య ఇకలేరు https://t.co/SMx9J5BWEn pic.twitter.com/OqlqG8kIdH— balu kayethi srcl (@baluanushaa) December 19, 2024






