కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని(Statue of Telangana Mother) నేడు CM రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సెక్రటేరియట్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత ఒకవైపు CM ప్రసంగిస్తుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural events) జరగనున్నాయి. అలాగే రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించిన కవి అందెశ్రీ(Ande shri)ని, విగ్రహ రూపకర్తలు అయిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం(Govt) సత్కరించనుంది.
అలరించనున్న ప్రత్యేక కార్యక్రమాలు
విగ్రహావిష్కరణ నుంచి రాత్రి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ, బహిరంగ సభ తరువాత రాత్రి 7.30 గంటలకు NTR మార్గ్ దగ్గర డ్రోన్ షో(Drone Show) నిర్వహిస్తారు. 8గంటలకు బాణసంచా ప్రదర్శన(Fireworks display) ఉంటుంది. అనంతరం HMDA గ్రౌండ్స్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్(Thaman) నేతృత్వంలో మ్యూజికల్ కార్యక్రమం(Musical programme) నిర్వహిస్తారు. ఈమేరకు పోలీసులు పటిస్ఠ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఇవాల సాయంత్రం సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్(Tank band) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.
హాజరుకానున్న ప్రజాప్రతినిధులు
కాగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోని ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహానికి రెండువైపులా వేదికలను సిద్ధం చేశారు. ఎడమ వైపు CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేది కను, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఈ రెండు వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.






