World Economic Crisis : ‘పెను ముప్పు ముంచుకొస్తోంది.. బంగారం, వెండి కొనుగోలు చేయండి’

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి(Robert Kiyosaki) రానున్న ఆర్థిక సంక్షోభం గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2025లో పెద్ద ఆర్థిక సంక్షోభం (World Economic crisis) రానుందని చెప్పారు.గతంలో జరిగిన చారిత్రక సంక్షోభాలను గుర్తు చేస్తూ 1998లో వాల్ స్ట్రీట్ ఒక హెడ్జ్ ఫండ్‌ను కాపాడగా, 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ (wall street) ను కాపాడాయని గుర్తు చేశారు. అయితే, 2025లో సెంట్రల్ బ్యాంకుల(Central banks) ను ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించడం ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

రుణ సంక్షోభమే ఆర్థిక సంక్షోభానికి కారణం..

ప్రస్తుత దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1971లో అమెరికా డాలర్‌(Doller)ను బంగారు ప్రమాణం నుండి తొలగిస్తూ నాడు తీసుకున్న నిర్ణయమే కారణమని కియోసాకి అభిప్రాయ పడ్డారు. జిమ్ రికార్డ్స్ అభిప్రాయం ప్రకారం.. 1.6 ట్రిలియన్ డాలర్ల విద్యార్థి రుణ సంక్షోభం ఈ తదుపరి ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని హెచ్చరించారు.

వీటిల్లో పెట్టుబడి పెడితేనే బెటర్..

కాగితపు కరెన్సీని దాచుకోవడం కంటే బంగారం (Gold), వెండి(Silver), బిట్‌కాయిన్‌ (Bit coins)లలో పెట్టుబడి (Investment) పెట్టడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని కియోసాకి ప్రజలకు సూచిస్తున్నారు. 25 సంవత్సరాల క్రితమే తాను “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తకంలో సంపన్నులు డబ్బు కోసం పని చేయరని, ఆదా చేసేవారు నష్టపోతారని చెప్పినట్లు గుర్తు చేశానని వివరించారు. 2012లో “రిచ్ డాడ్స్ ప్రాఫెసీ” పుస్తకంలో తాను హెచ్చరించిన ఆర్థిక పతనం ఇప్పుడే మొదలైందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

బంగారం కొనండి

అందుకే ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి నిజమైన బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేయాలని ఆయన సూచిస్తున్నారు. భవిష్యత్ లో వాణిజ్య యుద్ధాల కారణంగా క్యాష్ విలువ పడిపోతుందని( cash value fall).. అప్పుడు ఎంత సొమ్ము దాచుకున్న దానికి విలువ పెరగదన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో వాటి విలువ రెట్టింపు అయ్యే ఆస్కారం ఉందని.. అప్పుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన భయటపడొచ్చని సూచించారు.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *