మొన్న జైహనుమాన్.. నేడు ఛత్రపతి శివాజీ.. బిజీబిజీగా రిషబ్‌ శెట్టి

Mana Enadu : ‘కాంతార’ సినిమాతో కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాలపై యావత్ భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కాంతార ప్రీక్వెల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లోనూ భాగమయ్యారు. ‘జై హనుమాన్’ (Jai Hanuman) లో హనుమాన్ గా కనిపించనున్నారు. ఇక ఆయన తాజాగా మరో గొప్ప పాత్రతో అలరించేందుకు సిద్ధమయ్యారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించిన విశేషాలతో సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ (Chhatrapati Shivaji Maharaj). ప్రపంచ వ్యాప్తంగా 2027 జనవరి 21వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

నాకు చాలా గర్వంగా ఉంది

ఈ సందర్భంగా దీనిపై రిషబ్‌ మాట్లాడుతూ.. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గౌరవంగా, గర్వంగా ఉందని అన్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర అని తెలిపారు. ఇలాంటి యోధుడి చరిత్రను సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు. ఈ యాక్షన్‌ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్‌ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి’ అని రిషబ్ శెట్టి (Rishab Shetty Upcoming Movies) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

భేష్ రిషబ్ 

ఈ పోస్టర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. దీంతో రిషబ్‌ సినిమాల ఎంపికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘కాంతార’తో తన సత్తా చూపించిన రిషబ్.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు రెడీగా ఉన్నారు. మరోవైపు తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘హనుమాన్‌’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) సినిమాలో రిషబ్‌ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ సీక్వెల్‌ ‘హనుమాన్‌’కి మించి ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. హనుమంతుడి పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. దీనితో పాటు ‘కాంతార’ ప్రీక్వెల్‌(Kantara Prequel)తోనూ రిషబ్‌ శెట్టి బిజీగా ఉన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *