2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ కన్నడ చిత్రం ‘కాంతారా(Kantara)’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతారా చాప్టర్-1(Kantara Chapter-1)’ రిలీజ్ డేట్‌ను హోంబలే ఫిల్మ్స్(Hombale Films) అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిషబ్ శెట్టి(Rishab Shetty) రచన, దర్శకత్వం, నటనలో రూపొందుతున్న ఈ చిత్రం, కదంబ రాజవంశ యుగం(Kadamba Dynasty Era)లో సెట్ చేయబడిన ఫాంటసీ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నాగ సాధువుగా అతీత శక్తులతో కనిపించనున్నారు.
3,000 మంది నటీనటులతో..
హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో విజయ్ కిరగందూర్(Vijay Kiragandur) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం, 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 500 మంది నైపుణ్యం కలిగిన యోధులతో 3,000 మంది నటీనటులతో చిత్రీకరించిన భారీ యుద్ధ సన్నివేశం ఈ సినిమా హైలైట్‌గా నిలవనుంది. రిషబ్ శెట్టి ఈ పాత్ర కోసం కలరిపాయట్టు, గుర్రపు స్వారీ, కత్తియుద్ధం వంటి శిక్షణ తీసుకున్నారు. సప్తమి గౌడ(Sapthami Gowda), జయరామ్, కిషోర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath) సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలం చేకూరుస్తాయి. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.
Where legends are born and the roar of the wild echoes… 🔥#Kantara – A prequel to the masterpiece that moved millions.
Wishing the trailblazing force behind the legend, @shetty_rishab a divine and glorious birthday.
The much-awaited prequel to the divine cinematic… pic.twitter.com/0dTSh2lZ4k
— Hombale Films (@hombalefilms) July 7, 2025






