పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల(Police Officer Role)లో రాణించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా పాత్రల నుంచి ఆడియన్స్ కోరుకునే బాడీ లాంగ్వేజ్(Body language) డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. తమిళంలో విజయ్ కాంత్ .. మలయాళంలో సురేశ్ గోపి.. తెలుగులో రాజశేఖర్(Rajashekar) ఈ తరహా పాత్రలలో తమదైన మార్క్ చూపించారు. ఇక ఈ జనరేషన్ హీరోలు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు అడవి శేష్, రామ్(Ram), శ్రీ విష్ణు, ప్రయత్నించగా.. రీసెంట్ గా నాని(Nani) కూడా ‘హిట్ 3’ సినిమాలో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు.

ఆడియన్స్కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్
ఇక ఇప్పుడు హీరో ‘సాగర్(Sagar)’ వంతు వచ్చింది. ‘మొగలిరేకులు’ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ ‘ఆర్కే నాయుడు’గా సాగర్ మెప్పించాడు. ఈ పాత్రలో తన నటనకుగాను ఆయన ‘మెగా మదర్’ నుంచి మంచి మార్కులు కొట్టేశాడంటే అర్థం చేసుకోవచ్చు. పోలీస్ పాత్రలకు సాగర్ కరెక్టుగా సెట్ అవుతాడని అప్పుడే అంతా అనుకున్నారు. ఇంతకుముందు సాగర్ పోలీస్ ఆఫీసర్గా చేసినప్పటికీ, ఆ పాత్రను ఆవిష్కరించిన తీరువేరు. ఆయన తాజా చిత్రమైన ‘ది 100’ సినిమాలో మాత్రం పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథలో కొత్త పాయింట్ ఉందనీ, అది ఆడియన్స్కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్(Director Raghav Omkar Shashidhar) చెబుతున్నాడు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలోకి రానుంది.
The 100 (Upcoming Telugu Movie) | RK Sagar Speech at Meghale Song Launch | Press Meet
The 100 is an Upcoming Telugu Movie Starring RK Sagar, Misha Narang, Dhanya Balakrishna and Others. Written & Directed by Raghav Omkar Sasidhar, Music by Harshavardhan Rameshwar & Produced by… pic.twitter.com/vs3MQdkKxx
— KRIA FILM CORP (@kriafilmcorp) June 22, 2025






