
ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. రోబో తన సాంకేతిక నైపుణ్యంతో “నమస్కారం” అని చెప్పి, సంప్రదాయ భారతీయ శైలిలో CMని ఆహ్వానించింది. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా నవ్వుతూ నమస్కరించారు. ఇది అక్కడి వారి మధ్య ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమం APలో సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్‌ను అభివృద్ధి చేయడంపై సీఎం దృష్టి సారించారు. రోబో స్వాగతం రాష్ట్రంలో సాంకేతిక పురోగతికి ఒక చిహ్నంగా నిలిచిందని టీడీపీ(TDP) ట్వీట్ చేసింది.
ఏపీని టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న సీఎం
ఈ రోబోను స్థానిక స్టార్టప్ సంస్థ(A startup company) అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను ప్రదర్శిస్తుంది. చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ “సాంకేతికత(Technology) మన సంస్కృతిని, సంప్రదాయాలను కలిపి ముందుకు సాగడం గర్వకారణం. ఈ రోబో మన రాష్ట్ర యువత సృజనాత్మకతకు నిదర్శనం” అని ప్రశంసించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ సాంకేతిక సంస్కృతి సమ్మేళనాన్ని అభినందించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రాష్ట్రంలో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంఘటన ఏపీని సాంకేతిక కేంద్రంగా మార్చే చంద్రబాబు దృష్టికి బలమైన ఉదాహరణగా నిలిచింది. కాగా రోబో సీఎంకు వెల్ కమ్ చెప్పిన వీడియోను మీరూ చూసేయండి.
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు. అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను తిలకించారు.#RatanTataInnovationHub#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/JB02HHbQNS
— Telugu Desam Party (@JaiTDP) August 20, 2025