Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి రోహిత్బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా అని నెటిజన్లు, అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఫొటోలను పంచుకున్న సీఎం ఫడ్నవీస్

ముంబైలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రోహిత్ శర్మ బుధవారం కలిశాడు. కొద్దిసేపు వారు భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సీఎం ఫడ్నవీస్ నేరుగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా అధికారిక నివాసమైన వర్షలో రోహిత్ శర్మను కలుసుకోవడం, మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపాను. తన నూతన అధ్యాయంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోస్ట్ చేశారు.

ఆ బాటలోనే వెళ్తున్నాడా అని చర్చ

కెరీర్‌‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఎంతోమంది క్రికెటర్లు రాజకీయాల్లో చేరారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడు. ఆ బాటలోనే ఇప్పుడు రోహిత్ శర్మ వెళ్తున్నాడా అని చర్చ మొదలైంది. 2013లో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓవరాల్‌గా టీమిండియా తరఫున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 4301 పరుగులు చేశాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *