భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మరో నాలుగు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Boarder-Gavaskar Trophy) ప్రారంభం కానుంది. ఈనెల 22న పెర్త్(perth) వేదికగా తొలి టెస్టు షురూ అవుతుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టి ముమ్మర ప్రాక్టీస్ కూడా చేస్తోంది. అయితే టీమ్ మొత్తం అక్కడుంటే కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) మాత్రం తన భార్య రితికా మగ పిల్లాడికి జన్మివ్వడంతో అతడు టీమ్‌తో కలిసి వెళ్లడం కుదురలేదు. అలాగే మరికొన్ని రోజుల్ హిట్ మ్యాన్ తన భార్య, పిల్లలతోనే కలిసి భారత్‌తోనే ఉండనున్నాడట. దీంతో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చని జాతీయ మీడియా పేర్కొంది.
పేస్ గన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు?
ఇదిలా ఉండగా తాను తొలి టెస్టుకు అందుబాటులో ఉండనని ఇప్పటికే హిట్ మ్యాన్ బీసీసీఐ(Board of Control for Cricket in India)కి కూడా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ పెర్త్ టెస్టుకు అవైలబుల్ లేకుంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గతంలో 2022లోనూ ఇంగ్లండ్‌తో టెస్టుకు బుమ్రా సారథ్యం వహించాడు. కాగా అడిలైడ్ లో జరిగే రెండో టెస్టుకు రోహిత్ ఆస్ట్రేలియా చేరుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు.
గంభీర్‌కు అగ్ని పరీక్ష
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Boarder-Gavaskar Trophy) భారత కోచ్ గౌతమ్ గంభీర్(Coach Gautam Gambhir)కు అగ్ని పరీక్షగా మారనుంది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా పరువు పోవడమే కాదు.. గౌతీ కోచ్ పదవి కూడా ఊడిపోయే అవకాశం ఉంది. గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్ దారుణంగా ఓడిపోతోంది. శ్రీలంక(Srilanka) గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమ్ఇండియాపై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్(New Zealand)తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 0-3తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయింది. సో ఈ నేపథ్యంలో భారత్‌కు, కోచ్ గంభీర్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా కానుంది.






